- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాత శిశు సంరక్షణపై దృష్టి సారించాలి :కలెక్టర్ కుమార్ దీపక్
దిశ, మంచిర్యాల : మాత శిశు సంరక్షణ పై వైద్యులు దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా

దిశ, మంచిర్యాల : మాత శిశు సంరక్షణ పై వైద్యులు దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ అనిత తో కలిసి న్యూమోనియా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్, ఉప కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది ద్వారా న్యూమోనియా దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు కలిగిన వారందరికీ న్యూమోనియా పై అవగాహన పెంచే విధంగా కృషి చేయాలని వైద్యులకు సూచనలు చేశారు. చలికాలంలో చిన్నపిల్లలకు దగ్గు, జలబు, జ్వరం , బ్యాక్టీరియా వలన ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్ నుండి విముక్తిని పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టాలన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాలలో తల్లి పుట్టిన బిడ్డ సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అదేవిధంగా మాత శిశు మరణాల నిర్మూలనె ధ్యేయంగా వైద్యులువైద్యులు విధులు నిర్వర్తించాలన్నారు.
నవజాత శిశువుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..
పుట్టిన నవజాత శిశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని డాక్టర్ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. తల్లులకు న్యూ మోనియా పై అవగాహన కల్పించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో శ్వాస ఎక్కువగా తీసుకోవడం గురక పెట్టడం జ్వరం, జలుబు, దగ్గు నిద్రమత్తు లక్షణాలను గుర్తించి శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే డెలివరీ కేసుల పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ వో సుధాకర్ నాయక్, సూపరిండెంట్ వేద వ్యాస్, వైద్యులు దివ్య, డిపిహెచ్ఎస్ పద్మ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క. వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






