- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశ్రమ విద్యార్థులపై దృష్టి సారించాలి : ఐటీడీఏ ఇన్ చార్జి పీవో యువరాజ్ మర్మట్
దిశ, ఉట్నూర్ : ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ ఇంచార్జ్ పీవో యువరాజ్ మర్మట్ అన్నారు. గురువారం

దిశ, ఉట్నూర్ : ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ ఇంచార్జ్ పీవో యువరాజ్ మర్మట్ అన్నారు. గురువారం జైనూర్ మండలంలోని రాశిమెట్టలోని ఆశ్రమ పాఠశాల, భూసిమెట్టలోని గిరిజన గురుకుల కాలేజ్ ను ఆయన అకస్మికంగా తనిఖీలు చేశారు. రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడారు. గిరిజన విద్యారంగాన్ని బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత పొందే విదంగా చూడాలని ఉపాధ్యాయులకి ఆదేశించారు. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన విద్యార్థులకు ఉదయం స్నానానికి వేడి నీళ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. రోజు వారిగా విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలిస్తూ, ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు జెఈఈ, నీట్ కు ప్రిపేర్ అయ్యేవారికి తగిన సలహాలపై నివృత్తి చేయాలన్నారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






