- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోక్సో కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష
దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల పరిధి లో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం

దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల పరిధి లో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో నలుగురు నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.12,000 జరిమానా విధించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మంగళవారంతెలిపారు. ఈ శిక్షను జిల్లా ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. రమేష్ ప్రకటించారు. పిర్యాదు దారురాలు ఫిర్యాదు ప్రకారం.. 05-12-2020 న ఫిర్యాదు దారురాలు, ఆమె కూతురు(మైనర్ బాలిక) ఇంట్లో ఉన్న సమయంలో బెజ్జుర్ మండలం లోని ఓ గ్రామానికి చెందిన చౌదరి జలపతి, చౌదరి సుధాకర్, లంగారి కృష్ణయ్య, లంగారి అంకయ్యలు తమ ఇంటికి వచ్చి దాడి ప్రయత్నం చేసి, అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలో మొదటి ఐ.ఓ ఆశన్న (ఎ.ఎస్.ఐ), రెండవ ఐ.ఓ ఎస్సై సందీప్, మూడవ ఐ.ఓ ఎస్సై డి.సాగర్ చేపట్టారు. కోర్టులో ఫోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించగా.. కోర్టు లైజనింగ్ ఆఫీసర్, సిడిపిఓ రామ్ సింగ్ (ఎ.ఎస్.ఐ), సిడిఓ బాలాజీలు సహకరించారు.సాక్షాలు, సాక్షాధారాలు దర్యాప్తు నివేదికను పరిశీలించిన కోర్టు పై నలుగురిని దోషులుగా తేల్చి, ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాల కఠిన కారకార శిక్షతో పాటు, 12 వేల రూపాయల జరిమానా విధించింది. ప్రస్తుత ఎస్‌ఐ సార్తజ్ పాషా, కౌటాల సీఐ సంతోష్ కుమార్, డీఎస్పీ వాహిదుద్దీన్ కేసు పర్యవేక్షణలో ఉన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు.






