- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలోనే తొలి సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్
దిశ, మందమర్రి : సింగరేణిలో మొట్ట మొదటి సారిగా సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు మందమర్రిలో బీజం పడింది. పగటిపూట సోలార్ లో జరిగే విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించబడని విద్యుత్ ను

దిశ, మందమర్రి : సింగరేణిలో మొట్ట మొదటి సారిగా సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు మందమర్రిలో బీజం పడింది. పగటిపూట సోలార్ లో జరిగే విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించబడని విద్యుత్ ను ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా బ్యాటరీలో నిలువ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలోనీ మందమర్రిలో ప్రారంభించనున్నారు. పునరుత్పాదక విద్యుత్తు పెంపుదల కోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , చైర్మన్ బలరాం నాయక్ విశేషమైన కృషి భాగంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలో ఉన్నా 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు అనుబంధంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ను ఇటీవల ఏర్పాటు చేశారన్నారు .ఇది ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్. దీనిని రెండు మూడు రోజుల్లో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
బీఈఎస్ఎస్ ఎందుకు వీటి ఉపయోగం ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ విధంగా ఉత్పత్తి చేసే విద్యుత్తును తెలంగాణ ట్రాన్స్ కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్ ను గ్రిడ్కు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఇలా మిగిలిపోయిన సోలార్ విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది.మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ఒక తొలి అడుగుగా భావించవచ్చు. సుమారు 2.73 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ వలన సింగరేణి సంస్థ ఏడాదికి సుమారుగా వినియోగించబడని 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకుంటూ 70 లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో అనేక సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఉన్నప్పటికీ తొలిసారిగా బీఈఎస్ఎస్ ఏర్పాటు చేసే అవకాశం సింగరేణి సంస్థకి కల్పించారని మందమర్రి జిఎం కార్యాలయ సిబ్బంది అన్నారు.ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సింగరేణి వ్యాప్తంగా అనువైన చోట్ల ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.






