అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన

by Ratna Kumari |

అహర్నిశలు కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

అకాల వర్షంతో అన్నదాతలు  ఆందోళన
X

దిశ‌, మామ‌డ : అహర్నిశలు కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి మండలంలోని ఆయా గ్రామాల్లో అకాల వర్షం కురవడంతో పసుపు, మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న కంకి దశలో ఉండటంతో పాటు రైతులు ఉడకబెట్టిన పసుపు ఎండు దశలో ఉండడంతో టార్పలిన్ కవర్లు కప్పిన ప్రయోజనం లేదని కింది నుంచి నీరు వెళ్లి రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలు, రాళ్ల వర్షం కురవడంతో పంటలకు అపార నష్టం వాటిలిందని అన్నదాతలు వాపోతున్నారు.

Next Story