పోడు భూమిపై వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం కలకలం

by Batti.Sumithra |

అటవీ శాఖ అధికారుల వైఖరిని నిరసిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపింది.

పోడు భూమిపై వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం కలకలం
X

దిశ, ఆసిఫాబాద్ : అటవీ శాఖ అధికారుల వైఖరిని నిరసిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపింది. చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన రైతు దుర్గం రాజేశ్వర్ ఖర్జెల్లి, అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న పోడు భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని తన భూమిలో ట్రెంచ్ తవ్వుతున్నారని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని రాజేశ్వర్‌ను వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story