డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి..

by Taduka Kalyani |

ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యానవన పంటలను రైతులు సాగు చేసేలా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి..
X

దిశ,ఆదిలాబాద్ : ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యానవన పంటలను రైతులు సాగు చేసేలా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయం, ఉద్యాన, సెరికల్చర్ శాఖల అధికారులు రైతులకు విత్తనాలు, ఎరువుల వినియోగం, పంటల సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ఎంపిక చేయాలని రైతులకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయంలో మంచి లాభాలు పొందవచ్చన్నారు. రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, శాస్త్రవేత్తల సలహాలను వినియోగించుకోవాలని సూచించారు.

Next Story