ఆ రాజ‌కీయ నాయ‌కుల‌తో రైతులు జాగ్ర‌త్త‌..!

by Ratna Kumari |

రైతులను తమ రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అలాంటి రాజకీయ నాయకులతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

ఆ రాజ‌కీయ నాయ‌కుల‌తో రైతులు జాగ్ర‌త్త‌..!
X

దిశ, ఆదిలాబాద్ రూరల్ : ‎రైతులను తమ రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అలాంటి రాజకీయ నాయకులతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం జైనథ్ మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయ‌న‌ మాట్లాడారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం రైతులను వాడుకోవద్దని తెలిపారు. గోదాంలలో సరఫరా లేకపోవడం వల్ల కొనుగోలు ఆలస్యం అయిందని.. కానీ కొన్ని రాజకీయ నాయకులు తమ ధర్నా వల్ల కొనుగోలు జరుగుతుందని ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మార్కెట్ కమిటీ సభ్యులు బిజెపి నాయకులు రాందాస్,రాకేష్ రెడ్డి, అశోక్ రెడ్డి రాకేష్, అశోక్, లింగరెడ్డి పాల్గొన్నారు.

Next Story