- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శనగ, జొన్న పంటలు కొనుగోలు చేయాలి.. జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
శనగ, జొన్న పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జైనథ్, బేల మండలాల్లో జాతీయ రహదారులను శనివారం రైతులు దిగ్బంధించారు.

దిశ,ఆదిలాబాద్ రూరల్(జైనథ్): శనగ, జొన్న పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జైనథ్, బేల మండలాల్లో జాతీయ రహదారులను శనివారం రైతులు దిగ్బంధించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ రహదారి మండగడ ఎక్స్ రోడ్ వద్ద రాస్తారోకో చేపట్టి వాహనాలను నిలిపివేశారు. మరోవైపు బేలా మండలం కొబ్బాయి సిర్సన్న జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టగా మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని రైతులకు మద్దతుగా నిరసన చేపట్టారు. బేల మండలంలోని అంతరాష్ట్ర రహదారిని రాకపోకలను నిలిపివేశారు.దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు నుండి, అమ్ముకునే వరకు రైతులపై అనేక షరతులు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో రైతులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా నిబంధనలు లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడమే కాకుండా రైతులను పూర్తిగా ఆదుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవర్, గంబీర్, విఫిన్, దేవన్న, మస్కతేజో రావు, తదితరులు పాల్గొన్నారు.






