- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాలి వాన బీభత్సం.. రైతులకు పంట కోత కష్టాలు!
మండలంలో గాలి వాన బీభత్సానికి చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలకొరగడంతో కోతకు కష్టనష్టాలు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, కుబీర్: మండలంలో గాలి వాన బీభత్సానికి చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలకొరగడంతో కోతకు కష్టనష్టాలు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొరిగిన పంట చేనును కోత కూలీలకు చూపిస్తే ఎకరానికి రూ.4500 నుంచి రూ.5000 వరకు అంటున్నారని రైతులు వాపోతున్నారు. బీభత్సానికి ముందు ఎకరానికి రూ.3000 నుంచి రూ.3500 కోతకు కోశారు. అలాంటిది ఏకంగా ఎకరానికి రూ.1000 నుండి రూ.1500 ఎక్కువ అడిగిన కూలీలు దొరకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇతర గ్రామాల నుంచి వచ్చే కూలీలకు ఆటో చార్జీలు సైతం భరించుకునే పరిస్థితి వచ్చింది. పంట నిలువునా ఉంటే హార్వెస్టర్ సాయంతో పట్టించుకుంటే తక్కువ ఖర్చుతో ఇంటికి చేరేదని రైతులు అంటున్నారు. అలాగే నేలకొరిగిన జొన్న కోతకు పంట తీతకు డబుల్ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు అధికమైన గిట్టుబాటు ధరలు లేవు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.






