బీజేపీ తీర్థం పుచ్చుకున్న భోజరెడ్డి...

by Disha Web |
బీజేపీ తీర్థం పుచ్చుకున్న భోజరెడ్డి...
X

దిశ, ముధోల్ : ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంటలెక్చ్వల్ ఫారంఫౌండర్ బద్దం భోజారెడ్డి శుక్రవారం బైంసా పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు ఆధ్వర్యంలో భాజపా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సోయంబాపురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ ఐదవ పాదయాత్రకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై ఘనంగా నిర్వహించాలని అన్నారు.

అలాగే తాలూకాలో జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కనాయకులు, కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి, భాజపా నాయకులు మోహన్ రావు పటేల్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నవారి భూమన్న, ప్రధానకార్యదర్శిలు పైడిపేల్లి గంగాధర్, మెడిసిమ్మె రాజు, సామ రాజేశ్వర్, జిల్లా సహా ఇంచార్జ్ మహేష్, సుభాష్, గాలి రవి, అల్లం దిలీప్, రామకృష్ణ, మనోజ్, ముత్యం రెడ్డి , మణిక్, సోను పాటిల్, పార్టీ ప్రతినిధులు, నాయకులు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని ఘనంగా బద్దం భోజా రెడ్డిని బీజేపీ పార్టీలోకి స్వాగతించారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed