బెజ్జూర్ ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్లు

by Jakkula.Mamatha |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులు గాలి వర్షం కురిసింది.

బెజ్జూర్ ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్లు
X

దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులు గాలి వర్షం కురిసింది. సిర్పూర్ బెజ్జూర్ ప్రధాన రహదారిపై ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెజ్జూరు మండలంలోని అందుగుల గూడ గ్రామాల్లో ఐదు ఇండ్లపై కప్పులు లేచిపోయాయి. బెజ్జూర్ మండలంలోని పోతే పెళ్లి గ్రామంలో ఇటుక పై కవర్ కప్పుతుండగా, పోతే పెళ్లి గ్రామానికి చెందిన డోకి సంజీవ్ పై పిడుగు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను కుటుంబీకులు గమనించి బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ హాస్పిటల్‌కు తరలించారు.

Next Story