నకిలీ స్టాంప్ పేపర్ల తయారీ గుట్టు రట్టు..

by Bhanu |

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ పత్రాలు,నకిలీ స్టాంపులను తయారు చేసి నకిలీ ద్రువపత్రాలను సృష్టించిన తండ్రికొడుకులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు.

నకిలీ స్టాంప్ పేపర్ల తయారీ గుట్టు రట్టు..
X

దిశ,ఆదిలాబాద్ : ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ పత్రాలు,నకిలీ స్టాంపులను తయారు చేసి నకిలీ ద్రువపత్రాలను సృష్టించిన తండ్రికొడుకులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన లాడ్వీ రాహుల్ ఆయన తండ్రి లాడ్వీ బద్రినాథ్ లు ఇద్దరు కలసి ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికారుల సంతకాలతో కూడిన స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు.

కాగా బద్రీనాథ్ ను అరెస్టు చేశామని,రాహుల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.కంప్యూటర్,ప్రింటర్,స్టాంప్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్,వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story