- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి బోర్డు సమీపంలో గురువారం ప్రభుత్వ నిషేధిత గ్లైపోసిట్ నకిలీ పత్తి విత్తనాలను తాండూర్ పోలీసులు పట్టుకున్నారు.

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి బోర్డు సమీపంలో గురువారం ప్రభుత్వ నిషేధిత గ్లైపోసిట్ నకిలీ పత్తి విత్తనాలను తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల డిసిపి భాస్కర్ తాండూర్ పోలీస్ స్టేషన్‌లో పత్రిక విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్, తాండూర్ పోలీసులను అప్రమత్తం చేయడంతో వాహనాలను తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందన్నారు. ఆటోలో బెల్లంపల్లి నుంచి తాండూరుకు నకిలీ పత్తి విత్తనాలు డంపు చేస్తున్నారని సమాచారంతో అప్రమత్తమైనట్లు తెలిపారు.
రెబ్బెన మండలం నార్లపూర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడైన పూస.సుబ్బారావు, తాండూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓగరి.సమ్మయ్య, తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాగ్దుమ్ లు కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గుంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ విత్తనాలను మంచిర్యాల జిల్లాకు తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేపట్టగా పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద 150 కిలోల ప్రభుత్వ నిషేధిత గ్లైపోసిట్ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి పత్తి విత్తనాలతో పాటు ఆటోను సీజ్ చేయడం జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను డీసీపీ అభినందించారు.
నకిలీ పత్తి విత్తనాల సూత్రధారి..
గతంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో పూస.సుబ్బారావు ప్రభుత్వ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ నిషేధిత గ్లైపోసిట్ నకిలీ పత్తి విత్తనాల దందాలో పిడి యాక్ట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఇతను నకిలీ పత్తి విత్తనాల వ్యాపారమే లక్ష్యంగా బెల్లంపల్లి, తాండూర్, రెబ్బెన మండలాలలో అమాయక రైతులను ఆసరాగా చేసుకొని నకిలీ పత్తి విత్తనాల దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పీడీ యాక్ట్ కేసు నమోదు అయింది. దీనితోపాటు విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పలు మండలాల్లో ప్రభుత్వ టీచర్ గా పని చేస్తూ గురుకుల పాఠశాలలో సైతం విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.






