- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్ కలెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్.. అలర్ట్ గా ఉండాలని సూచన
దిశ, నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతా క్రియేట్ చేశారు. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. నిర్వాహకుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. సామాన్యులు,

దిశ, నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతా క్రియేట్ చేశారు. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. నిర్వాహకుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలతో నకిలీ వాట్సాప్ ఖాతాలు సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలు తరుచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిర్మల్ కలెక్టర్ తో నకిలీ వాట్సాప్ సందేశాలు వస్తున్నాయని గుర్తించిన అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ఆ నెంబర్ నుంచి సందేశాలు వచ్చాయని.. వాటితో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని నిర్మల్ కలెక్టర్ తెలిపారు. అయితే కలెక్టర్ అభిలాష అభినవ్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు.ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఫేక్ అకౌంట్ పట్ల నిర్మల్ జిల్లా ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కాగా ఈ వ్యవహారం అటు అధికారులతో పాటు జిల్లా ప్రజల్లో కలకలం రేపింది.
గతంలో కూడా కలెక్టర్ ముషారఫ్ అలీ కలెక్టర్ గా ఉన్న సమయంలో కూడా అతని వాట్స్ ఆప్ నుంచి పలు సందేశాలు వెళ్ళినట్టు సమాచారం. కలెక్టర్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ నుంచి సందేశాలు వచ్చాయి. కానీ కలెక్టర్ డీపీ ఉండటం.. కలెక్టర్ పంపించినట్టుగా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. తమ పేరిట ఫేక్ ఖాతా క్రియేట్ చేశారని గుర్తించి కలెక్టర్ అలెర్ట్ అయ్యారు. తాజాగా కూడా అలాంటి సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా 66958518330 నెంబర్ నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్ కి కాల్ వచ్చినట్టు సమాచారం. ఈ నెంబర్ థాయ్ లాండ్ కి చెందినట్టు తెలుస్తోంది. కలెక్టర్ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి మరేలా.. అంటూ చర్చించుకోవడం విశేషం.






