- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత విద్వేషాలకు బ్రేక్.. ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లు డిలీట్
మత విద్వేషాలకు దారితీసే పోస్టులు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దిశ, బైంసా: గత కొంతకాలంగా భైంసా పట్టణంలో కొంతమంది దుండగులు తప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్లను సృష్టించి, మార్ఫ్ చేసిన వీడియోలు మత విద్వేషాలకు దారితీసే పోస్టులు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పలువురి పై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రెండు తప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్లను గుర్తించి, ఆ రెండు ఫేస్ బుక్ అకౌంట్‌లను తొలగించడం జరిగిందని, త్వరలోనే అట్టి అకౌంట్లను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఎవరైనా సోషల్ మీడియాలో అనుమానాస్పద, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.






