ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. వ్యక్తి అరెస్ట్..

by Bhanu |

ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి వారి వద్ద నుండి రూ.7 లక్షల 5 వేలు వసూలు చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. వ్యక్తి అరెస్ట్..
X

దిశ, అదిలాబాద్ : ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి వారి వద్ద నుండి రూ.7 లక్షల 5 వేలు వసూలు చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్,అదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లికి చెందిన గంగాధర్ కు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7 లక్షలు తీసుకున్నాడు. అనంతరం బాధితుడికి నకిలీ ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చి మోసం చేశాడు.

దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి..వినయ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.విచారణలో వినయ్ తో పాటు రమేష్ అనే వ్యక్తి కూడా నేరం చేసినట్లు తెలియడంతో అతనిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే వారి మాయమాటలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story