- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..
by I. Sairam |
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు.

X
దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. భారతదేశాన్ని సన్మార్గంలో నడిపించిన మహానుభావుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని మార్కెట్ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కొనియాడారు. ఇక రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఐటి, విద్య, టెలికాం, రక్షణ, వాణిజ్య, సంస్కరణలు ప్రవేశ పెట్టారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, పిఎసిఎస్ చైర్మన్ ఇప్ప సత్యనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కావాలి సంతోష్, అంకం రాజేందర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






