- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
దిశ, ఆసిఫాబాద్ : ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య

దిశ, ఆసిఫాబాద్ : ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ. తెలంగాణ హెచ్ ఐవీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ. అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్. డీఎంహెచ్ వో సీతారాం. జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నీలిమలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆసిఫాబాద్ జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా నిర్మిద్దామని, ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హెచ్ ఐవీ వంటి లక్షణాలు ఉంటే వీలైనంత త్వరగా పరీక్షించుకొని సత్వర వైద్య సేవలు పొందాలని. జీవిత భాగస్వామికి కూడా పరీక్షలు చేయించాలన్నారు. వ్యాధిగ్రస్తుల పట్ల స్నేహభావంతో మెలిగి వారిలో ఆత్మస్థైర్యం నింపాలని.వ్యాధి వ్యాప్తి నివారణకు నిరంతరం సహకరించాలని. వారిపట్ల వివక్ష చూపకుండా వారిలో ఆదరించి ఆత్మవిశ్వాసం కల్పించాలని చెప్పారు. అనంతరం అడ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేసి. లబ్దిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.






