ప‌ట్ట‌ణాభివృద్ధికి కొర‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలి : ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-05-03 13:27:54  IST  )

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. పట్టణంలోని ఉట్కూర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు 80 ఫీట్ల రహదారి వెడల్పును తగ్గించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ప‌ట్ట‌ణాభివృద్ధికి కొర‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలి :  ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు
X

దిశ, లక్షెట్టిపేట : మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. పట్టణంలోని ఉట్కూర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు 80 ఫీట్ల రహదారి వెడల్పును తగ్గించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను, ప్రమాదాలను తగ్గించడానికి రోడ్ల వెడల్పు అత్యవసరమని, పట్టణ రూపురేఖలను మార్చి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. రోడ్ల వెడల్పు వల్ల పట్టణంలో ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి, ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు. వ్యక్తిగత నిర్ణయం కాదని, ఈనెల 07వ‌ తేదీ నుంచి మున్సిపల్ అధికారులు సిబ్బందితో కూల్చి వేతలు ప్రారంభిస్తామన్నారు. ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం కొద్ది పాటి అసౌకర్యాన్ని భరించి, మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చెల్లా నాగభూషణం మోత్కూరి వెంకటస్వామి గౌడ్ దొంత నరసయ్య పాల్గొన్నారు.

Next Story