- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
45 ఏళ్లు గడిచినా.. గిరి గ్రామాల్లో అదే పరిస్థితి..!
దిశ, ఆసిఫాబాద్ : ఆదివాసీ గిరిజన గ్రామాల్లో జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం సాగించిన మహానీయుడు కొమురం భీం ఆశయ సాధనకు

దిశ, ఆసిఫాబాద్ : ఆదివాసీ గిరిజన గ్రామాల్లో జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం సాగించిన మహానీయుడు కొమురం భీం ఆశయ సాధనకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పూర్తిగా విఫలమయ్యాయని కొమురం భీం మానవుడు సోనేరావు ఆరోపించారు. మంగళవారం కెరమెరి జోడేఘాట్ లో కొమురం భీం 85వ వర్థంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొమురం భీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుతున్న పాలకులు.. గిరి గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. ఆదివాసీ గిరిజనులకు విద్య, వైద్యం, రోడ్డు రవాణా, పక్క ఇండ్లు, భూమి హక్కు పత్రాలు ఇస్తామని నా 45 ఏళ్లు కాలం నాటి నుండి పాలకులు వర్థంతి సభలో ప్రకటిస్తూ వచ్చారు. ఇంకా కాలం వెల్లదిస్తున్నారే తప్పా ఇచ్చిన హామీని ఎవ్వరూ నెరవేర్చలేదని తెలిపారు. జోడేఘాట్ వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని పాలకుల తీరు పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైన సర్కార్ స్పందించి ఆదివాసీలకు జల్ జంగల్ జమీన్ అందించేలా తాగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల పట్ల కాంగ్రెస్ చిన్నచూపు : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆదివాసీ గిరిజనుల పట్ల సర్కార్ చిన్నచూపు చేస్తుందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొమురం భీం పోరాట గడ్డ జోడేఘాట్ అభివృద్ధి కోసం 25 కోట్లు కేటాయించి. భీం కాచి విగ్రహంతో పాటు మ్యూజియం. ఇతర అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు ఇచ్చామని తెలిపారు. కానీ కాంగ్రెస్ గత దర్బార్ లో 3500 ఇండ్లతో పాటు జోడేఘాట్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అమలు చేయలేదని చెప్పారు. గత సర్కార్ లో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది ఏమి లేదన్నారు.






