- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళాలు తెరుచుకొని ఏటిగూడ గిరిజన పాఠశాల
ఏటిగూడ గిరిజన పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయుడు పదవి విరమణ చేయడంతో కొత్త ఉపాధ్యాయుడు లేక పాఠశాల తెరుచుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

దిశ, బెజ్జూర్ : బెజ్జూరు మండలంలోని ఏటి గూడ గిరిజన ప్రాథమిక పాఠశాల గత 25 రోజులుగా మూసి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి మూడో తరగతి వరకు పది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పరదేశి జనవరి 31న పదవి విరమణ పొందారు. దీంతో ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో పాఠశాల తెరవకపోవడంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత మండల స్థాయి విద్యాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఉపాధ్యాయుడిని నియమించలేదని, ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించి, పేద గిరిజన విద్యార్థులకు విద్యను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయం పై సోమిని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షమయ్యను సంప్రదించగా.. ఉపాధ్యాయులు లేని మాట వాస్తవమేనని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.






