బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ

by Taduka Kalyani |

బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ
X

దిశ, ఆసిఫాబాద్: బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారానికి సంబంధిత డీఎస్పీలు, ఎఎస్పీలు, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల స్థితిని తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా, పైరవీలు లేకుండా స్వేచ్ఛగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. తమ సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకునేలా పోలీసులు సహకరిస్తారని తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి, శాంతి భద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీసులు పనిచేస్తారని ఎస్పీ నితిక పంత్ పేర్కొన్నారు.

Next Story