ఉద్యోగులు సమయపాలన పాటించాలి స‌బ్ క‌లెక్ట‌ర్ మ‌నోజ్

by Ratna Kumari |

దిశ, తాండూర్ : ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో, తహశీల్దార్

ఉద్యోగులు సమయపాలన పాటించాలి స‌బ్ క‌లెక్ట‌ర్ మ‌నోజ్
X

దిశ, తాండూర్ : ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలను గురువారం సబ్ కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం భూ సమస్యల పరిస్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రిపోర్టుపై ఆరా తీశారు. విధుల్లో ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసిల్దార్ జ్యోత్స్న, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Next Story