రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ ప్ర‌మాదాలు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కుబీర్ : ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ప్రతి పనికి విద్యుత్ అవసరం త‌ప్ప‌నిస‌రి. గ్రామీణ ప్రాంత జనాలకు రైతులకు వినియోగంపై స‌రైన

రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ ప్ర‌మాదాలు..!
X

దిశ, కుబీర్ : ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ప్రతి పనికి విద్యుత్ అవసరం త‌ప్ప‌నిస‌రి. గ్రామీణ ప్రాంత జనాలకు రైతులకు వినియోగంపై స‌రైన అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అవగాహన రాహిత్యంతో నెలలోపే వేర్వేరు విద్యుత్ ప్రమాదాలలో కుబీర్ మండలంలో ముగ్గురు మృతి చెందారు. సిరిపెల్లి తండాలో కిషోర్ అనే వ్యక్తి చేల్లో టెంటు వేస్తుండగా.. 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి నవీన్ అనే యువకుడు మృతి చెందాడు. శ్యామ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మూడో విడత ఎన్నికల రోజే పల్సి గ్రామంలో ప్రణీత్ కుమార్ ఉదయం అయ్యప్ప మాలధారణ పూజ చేసుకొని మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. జుండా గ్రామం వద్ద హార్వెస్టర్ కు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నెల రోజుల్లోపే మూడు విద్యుత్ ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందడం విషాదకరంగా మారింది. మూడు కుటుంబాల్లోను చేదోడు వాదోడుగా ఉన్న వాళ్ళను కోల్పోయారు. గ్రామాల్లో పని చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది పల్లెల్లోను, తండాళ్లోను జనాలకు రైతులకు, విద్యుత్ వినియోగంపై ప్రమాదాలకు కారణమయ్యే సంఘటనలపై అవగాహన కల్పించాలని పల్లె జనాలు వాపోతున్నారు. కొన్ని గ్రామల్లో 11 కేవీ విద్యుత్ తీగలు ఇళ్ల పై నుంచే వేలాడుతుండటంతో భయం భయంగా కాలం వెళ్ళదీస్తున్నామని వాపోతున్నారు. విద్యుత్ శాఖ A E ఆదిత్యనాథ్ ని వివరణ కోరగా.. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న తమ సిబ్బంది ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. ప్రమాదకరంగా ఉన్న సమస్యలను తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు. మూడు ప్రమాదాలు జరగడం దురదృష్టకరమన్నారు.

Next Story