- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్
by Batti.Sumithra |
చెన్నూర్ నియోజకవర్గం రామకృష్ణపూర్ పట్టణంలో తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.

X
దిశ, రామకృష్ణాపూర్ : చెన్నూర్ నియోజకవర్గం రామకృష్ణపూర్ పట్టణంలో తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ 9 గంటలకు ఊపందుకుంది. వృద్ధులు, వికలాంగులు రామకృష్ణపూర్ పరిధిలో మొత్తం 35 పోలింగ్ కేంద్రాలలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొదటి సారి ఓటు హక్కును యువకులు వినియోగించుకున్నారు.
నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల వరకు 74.61 శాతం పోలింగ్ నమోదు అయింది. క్యాతనపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విప్ సుమన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే పోలింగ్ శాతం పై మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






