- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల అధికారులు సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి : కలెక్టర్ కుమార్ దీపక్
దిశ, చెన్నూర్ : సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఈనెల 17న జరగనున్న 3వ విడత పోలింగ్ నిర్వహణ కొరకు

దిశ, చెన్నూర్ : సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఈనెల 17న జరగనున్న 3వ విడత పోలింగ్ నిర్వహణ కొరకు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మందమర్రి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల- జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 3వ విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటింగ్, కౌంటింగ్ కొరకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.
ఈ నెల 16న అధికారులు నిర్దేశిత సమయానికి తమకు కేటాయించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలలో రిపోర్టు చేయాలని, ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 3వ విడతలో భాగంగా 17వ తేదీన జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడం జరుగుతుందని, ఈ నెల 17న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించాలని, అధికారులు, మీడియా ప్రతినిధులు అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు.






