- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో బావిలో పడి వృద్ధుడు మృతి..
మద్యం మత్తులో బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.

దిశ, బెజ్జూర్: మద్యం మత్తులో బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం, బెజ్జూర్ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన మెరుగు రామయ్య (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఇటీవల రైతు బంధు పథకం కింద మెరుగు రామయ్యకు రూ. 6000 రావడంతో, తన సోదరి లోడుపల్లి గ్రామానికి చెందిన జాజిమొగ్గ ఈశ్వరి ఇంటికి వెళ్లారు. వారం రోజులు అక్కడే నివాసం ఉన్న రామయ్య తిరిగి ఈ నెల 11న బెజ్జూర్ మండలం కాటేపల్లి సొంత గ్రామానికి బయలుదేరారు.
మద్యం మత్తులోనే బావిలో పడిపోవడం వల్లనే మృతి..
అదేరోజు మధ్యాహ్నం బరగూడెం గ్రామానికి చెందిన భీంకర్ తిరుపతి రామయ్య మధ్యమధ్యలో ఉన్నాడని తన కుమారుడికి సమాచారం అందించారు. కుమారుడు దేవాజి సమాచారం అందుకొని స్పందించకపోవడంతో కాటేపల్లి శివారులో ఆత్రం దామోదర్ వరి చేనులో ఉన్న బావిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి, సోమవారం సాయంత్రం కనుగొన్నారు. రామయ్య మద్యం సేవించి అలవాటు ఉండి, గతంలో ఇలాంటి సందర్భాల్లో కొన్ని రోజులపాటు, ఇంటి నుండి వెళ్లిపోయే వారిని కుటుంబీకులకు ఎలాంటి అనుమానం లేదని మద్యం మత్తులోనే బావిలో పడిపోవడం వల్లనే మృతి చెందవచ్చు పని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సర్తజ్ పాషా తెలిపారు






