- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
దిశ, మంచిర్యాల : బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో

దిశ, మంచిర్యాల : బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై యువత బీజేపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని అన్నారు. గ్రామ స్వరాజ్యం బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వారందరూ గెలుపు దిశగా పయనించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ప్రతి ఒక్క కార్యకర్త నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వైద్య శ్రీధర్, భీమిని మండల అధ్యక్షుడు కొంక. సత్యనారాయణ, గాండ్ల. సాయి కిరణ్ పాల్గొన్నారు.






