- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయ అభివృద్ధికి కృషి
by Sridhar Babu |
బేల మండల కేంద్రంలోని అతి పురాతనమైన మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

X
దిశ, ఆదిలాబాద్ : బేల మండల కేంద్రంలోని అతి పురాతనమైన మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పురాతన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం రూ.25 లక్షల నిధులను త్వరలో మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అంతకు ముందు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దత్తానిక్కం, బీజేవైఎం మండల అధ్యక్షుడు పొత్ రాజ్ నవీన్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాము బర్కడే, మండల్ జనరల్ సెక్రటరీ సందీప్ ఠాక్రే, మాజీ సర్పంచ్ ఇంద్రశేఖర్, గణేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






