- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ టాపర్ ను సన్మానించిన విద్యాశాఖమంత్రి
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి జెల్లా అమన్ ను విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సన్మానించారు.

X
దిశ, తాండూర్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి జెల్లా అమన్ ను విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సన్మానించారు. హైదరాబాద్ లో ఎస్సీఈ ఆర్టీ భవనంలోని గోదావరి కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సన్మానం చేసినట్టు ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ బోర్డు పరీక్షల్లో ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించిన జెల్లా అమన్ రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు. రాష్ట్ర స్థాయిలో జెల్లా అమన్ సత్కారం పొందడం జిల్లా కే గర్వకారణమని డీఐఈఓ సుమన్ ప్రశంసించారు.
Next Story






