- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానసిక వేదనతో కన్నబిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య
దిశ, జన్నారం : మానసిక వేధనతో కన్న బిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రేండ్లగూడ గ్రామంలో చోటుచేసుకుంది. జన్నా

దిశ, జన్నారం : మానసిక వేధనతో కన్న బిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రేండ్లగూడ గ్రామంలో చోటుచేసుకుంది. జన్నారం ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన చెటుపల్లి శ్రవణ్, జగిత్యాల జిల్లా సారంగపూర్ చెందిన స్పందన (24)తో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు కూతుర్లు సంతానం. చిన్న కూతురు జన్మించిన నుంచి ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో పలుమార్లు తాను చనిపోతానని చెప్పేది. గత ఆరు నెలలుగా ఎప్పుడు మానసికంగా ఆలోచించేది. శుక్రవారం చిన్న కూతురు వేధశ్రీ కి(9 నెలలు) అన్నం తినిపించుకుంటూ ఉంది. పాపతో పాటుగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లి దూకింది. గంట పాటు స్పందన కనిపించకపోయే సరికి పరిసరాలు వెతికారు. అనుమానంతో బావిలో చూడగా మృత దేహమై కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై అనూష సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి మృతురాలి తల్లి భూదారపు ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






