మాదకద్రవ్యాల నియంత్రణ సమాజ బాధ్యత : కలెక్టర్ రాజర్షి షా

by Batti.Sumithra |

మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణ సమాజ బాధ్యత : కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, ఆదిలాబాద్ : మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి రిమ్స్ ఆడిటోరియం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘అల్ప్రాజోలం’ వంటి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. యాంటీబయాటిక్స్‌ను డాక్టర్ సూచనల మేరకే వాడాలని తెలిపారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం పై నిఘా పెంచాలని, మత్తుకు బానిసైన వారికి కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story