- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం చేయవద్దు : అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య
దిశ, మంచిర్యాల : ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం పై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన

దిశ, మంచిర్యాల : ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం పై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి లో దరఖాస్తులపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 27 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఆయా మండలాల నుండి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు వారీగా దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇంటి నిర్మాణాలు పూర్తయిన వారికి బిల్లులు చెల్లించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.






