ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోకండి : గ‌నుల శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, చెన్నూర్ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోకండి : గ‌నుల శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి
X

దిశ‌, చెన్నూర్ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందని తెలిపారు. ఎవరూ మధ్యవర్తుల పాలవ్వకుండా, రైతులు నేరుగా ప్రభుత్వ కేంద్రాలకు తమ పత్తి అమ్మకాలు కొనసాగించాలని ఆయన తెలిపారు. రైతులు పండించిన పత్తి గ్రేడ్‌-ఏ క్వింటాలుకు రూ.8100 చొప్పున ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తేవాలని ఆయన తెలిపారు. అధికారులు ఎటువంటి లాభా పేక్షలు లేకుండా, కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలనీ, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని రైతులకు అన్యాయం జరిగిందని తన దృష్టికి వస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Next Story