- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే
రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ, మామడ : రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొన్కల్, పరిమండల్ , కొరటికల్ గ్రామాల్లో సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకొని 2400 రూపాయలు మద్దతు ధర పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, ఏవో సంధ్య, పీఎసీఎస్ సీఈఓ రాజేందర్, నాయకులు రావుల రామ్ నాథ్, బాపురెడ్డి, కొండ్ర రాజారెడ్డి, చిన్నారెడ్డి, రంజిత్, సూరి, రాజేశ్వర్, వెంకటేశ్వరరావు, చంద్రకాంత్, సచిన్, రైతులు పాల్గొన్నారు.






