వరదల్లో, పండగల్లో జిల్లా అధికారుల పనితీరు భేష్!

by Elthuri vijay kumar |

ఇటీవల సంభవించిన వరదలు, శాంతియుతంగా జరిగిన పండగల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పనితీరు అభినందనీయమని ఏ.ఐ.ఎం.ఐ.ఎం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బైంసా మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ జాబిర్ హైమద్ అన్నారు.

వరదల్లో, పండగల్లో జిల్లా అధికారుల పనితీరు భేష్!
X

వరదల్లో, పండగల్లో జిల్లా అధికారుల పనితీరు భేష్!

- అవగాహన రహిత పనులతో సున్నిత ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టొద్దు

- విశ్రాంతి భవనాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి

- ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఏఐఎంఐఎం అధ్యక్షుడు జాబిర్ హైమద్

దిశ,భైంసా : ఇటీవల సంభవించిన వరదలు, శాంతియుతంగా జరిగిన పండగల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పనితీరు అభినందనీయమని ఏ.ఐ.ఎం.ఐ.ఎం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బైంసా మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ జాబిర్ హైమద్ అన్నారు. శనివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు... బైంసా లాంటి సున్నీత ప్రాంతంలో ప్రజలు,అధికారులు సమన్వయం మెలగాలని అన్నారు.గతంలో శివాజీ చౌక్ ప్రాంతంలో శివాజీ విగ్రహ గద్దె నిర్మాణ ఏర్పాటు పనిలో భాగంగా యువకులు గుంతను ఏర్పాటు చేసుకోగా అట్టి గుంతను ఇక్కడి అధికారులు పూడ్చివేయాలంటూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారని ఆరోపించారు. అలాగే వెంకటేశ్వర టెంపుల్ ప్రాంగణంలో అక్కడి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్డుని సైతం ఇక్కడి అధికారులు తొలగించమన్నారని ఆరోపించారు. బైంసా లాంటి సున్నీత ప్రాంతంలో సమన్వయంతో ఉండి అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అలాగే బైంసా మున్సిపల్ ప్రాపర్టీ విషయంలో సైతం ఇదే తంతు జరుగుతుందని ఆరోపించారు. నిమజ్జన వేడుకలు, ఇతరేతర కార్యక్రమాల నేపథ్యంలో అధికారులు, ప్రజా నాయకులు సమావేశాల కోసం విశ్రాంతి భవనం ఉంది కానీ అక్కడే అధికారులు మాకాం వేయడానికి కాదని విమర్శించారు.70 వేల మందికి ఉన్నటువంటి భైంసా తహసీల్ కార్యాలయానికి ప్రతిరోజు నిత్యం వందల మంది వచ్చి పోతుంటారని, అక్కడ కూడా పార్కింగ్, తాహసీల్ కార్యాలానికి వెళ్లే రూటుపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు.

Next Story