ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి : డాక్టర్ అనిత

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మంచిర్యాల : ఆరోగ్యమే మహాభాగ్యం అని అవగాహనతోనే మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్.అనిత అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య పరిరక్షణ

ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి : డాక్టర్ అనిత
X

దిశ‌, మంచిర్యాల : ఆరోగ్యమే మహాభాగ్యం అని అవగాహనతోనే మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్.అనిత అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్, కేజీబీవీ విద్యాలయంలో అవ‌గాహ‌న‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా వైద్యశాఖ అధికారిని హాజ‌రై మాట్లాడారు. అవగాహనతోనే సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. జిల్లాలో నెల రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, ట్రైనింగ్ సెంటర్లు, యువత, విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.


ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు మత్తుపదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. యువత రకరకాల మానసిక ఇబ్బందులతో ఒంటరితనంతో సతమతం అవుతున్నారని వీరిలో సంపూర్ణ ఆరోగ్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. మానసిక ఆరోగ్యం కూడా మానవ వికాసానికి మానసిక ఆరోగ్యం ఎంతో కీలకమన్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో టొబాకో పొగాకు ఉత్పత్తులు వాటి ద్వారా వచ్చే అనర్ధాలపైన అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్, వైద్యులు నజియా, లింగారెడ్డి, లక్ష్మణస్వామి, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, కేజీబీవీ ప్రిన్సిపల్ స్వప్న పాల్గొన్నారు.

Next Story