- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుగ్గ ఆలయంలో మొక్కులు తీర్చుకున్న జిల్లా జడ్జి
by Kema Shiva Kumar |
బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో జిల్లా జడ్జి బి.సత్తయ్య సోమవారం మొక్కులు చెల్లించుకున్నారు.

X
దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో జిల్లా జడ్జి బి.సత్తయ్య సోమవారం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. బుగ్గ దేవాలయం సందర్శించి మొక్కులు తీర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని న్యాయమూర్తి సత్తయ్య అన్నారు. జడ్జిని సన్మానించిన వారిలో బెల్లంపల్లి దేవాలయ కమిటీ ఈవో బాపిరెడ్డి, సర్పంచ్ స్వరూప, సభ్యులు వెంకటస్వామి మాసాల శ్రీరాములు తదితరులు ఉన్నారు. ఆలయాన్ని సందర్శించిన జిల్లా జడ్జి బి.సత్తయ్యకు బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్, తాళ్ల గురజాల ఎస్సై నరేష్ వర్మ బందోబస్తు నిర్వహించారు.
Next Story






