- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఆర్ఐను పారదర్శకంగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
మండలంలో ఈ నెల 16వ తేదీ వరకు ఎస్ఐఆర్ పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.

దిశ, ముధోల్: మండలంలో ఈ నెల 16వ తేదీ వరకు ఎస్ఐఆర్ పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. మండలంలో ఎస్ఐఆర్‌కు సంబంధించిన వివరాలను తహసిల్దార్ శ్రీలతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఈనెల 16 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను డిజిటలైజేషన్‌తో పూర్తి చేయాలని అన్నారు. ఓటర్ షిఫ్టింగ్, మరణించినవారు, వలస వెళ్లిన వారి ఓటర్లను విచారణ జరిపి తొలగిస్తున్నట్లు ప్రత్యేకంగా గుర్తించి ఆ జాబితను ప్రత్యేకంగా తయారు చేయాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు..
జాబితాను గ్రామాల్లో ఉన్న ఆయా పార్టీల నాయకుల సమక్షంలో విడుదల చేసి, వారి సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలను ఇందుకు ఉపయోగించుకోవాలని తాహసీల్దారును కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తరోడ సర్పంచ్ హరిపొద్దిన్ ఆర్‌ఐ నారాయణరావు పటేల్, పంచాయతీ కార్యదర్శ, బీఎల్వోలు అర్షియాతబస్సం తదితరులు, పాల్గొన్నారు.






