రేషన్ లబ్ధిదారులకు నాన్ ఓపెన్ సంచుల పంపిణీ : అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులలో నవంబర్ 01వ తేదీ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు నాన్ ఓపెన్ సంచులను పంపిణీ చేయడం జరుగుతుందని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

రేషన్ లబ్ధిదారులకు నాన్ ఓపెన్ సంచుల పంపిణీ :  అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య
X

దిశ, మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులలో నవంబర్ 01వ తేదీ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు నాన్ ఓపెన్ సంచులను పంపిణీ చేయడం జరుగుతుందని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ బియ్యం తీసుకునేందుకు ఒకసారి, నాన్ ఓపెన్ సంచిని పొందేందుకు రెండుసార్లు వేలిముద్ర ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఏ చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు కలిగి ఉన్నారో అక్కడ మాత్రమే నాన్ ఓపెన్ సంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. పోర్టబిలిటీ విధానం ద్వారా ఇతర షాపులలో రేషన్ బియ్యం పొందే వారికి నాన్ ఓపెన్ సంచి ఇవ్వబడదు అన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

Next Story