బాలుర గురుకుల గిరిజన విద్యార్థి అదృశ్యం

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఇచ్చోడ : బాలుర గురుకు గిరిజ‌న విద్యార్థి అదృశ్య‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ కిష‌న్ చౌహ‌న్ తెలిపిన‌ వివ‌రాల ప్ర‌కారం.. నార్నూర్ మండ‌లం మ‌హాగావ్ గ్రామానికి

బాలుర గురుకుల గిరిజన విద్యార్థి అదృశ్యం
X

దిశ, ఇచ్చోడ : బాలుర గురుకు గిరిజ‌న విద్యార్థి అదృశ్య‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ కిష‌న్ చౌహ‌న్ తెలిపిన‌ వివ‌రాల ప్ర‌కారం.. నార్నూర్ మండ‌లం మ‌హాగావ్ గ్రామానికి చెందిన జాద‌వ్ రోహిదాస్ కుమారుడు అనికేత్ (15) బాలుర గిరిజ‌న గురుకుల పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఈనెల 06న మ‌ధ్యాహ్నం పాఠ‌శాల నుంచి బ‌య‌టికి వెళ్లిన‌ట్టు సీసీ కెమెరాల్లో ఉంద‌ని పాఠ‌శాల‌ సిబ్బంది తెలిపారు. తెలుపు ప్యాంట్, న‌లుపు రంగు ష‌ర్ట్ వేసుకొని ఉన్నాడ‌ని తండ్రి తెలిపారు. ఆచూకి తెలిసిన వారు 6309368196, 8523036321 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విష‌యం పై గిరిజన ప్రాజెక్ట్ అధికారి పీవో దృష్టికి కలెక్టర్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కిషన్ చౌహన్ పేర్కొన్నారు.

Next Story