- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పై దృష్టి సారించాలి : డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి..
బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పై దృష్టి సారించాలి : డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి..
by Batti.Sumithra |
బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) అన్నారు.

X
దిశ, తాండూర్ : బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) అన్నారు. ఏరియాలోని కైరిగూడ ఓసీపీని ఆయన గురువారం సందర్శించారు. ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి , ఉత్పాదకత, సివిల్ పనులపై అధికారులతో డైరెక్టర్ సమీక్షించారు.
పావురాల గుట్ట వద్ద జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. రానున్న ఆర్ధిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాలపై అన్ని విభాగాల అధికారులు సిబ్బందికి మార్గ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దేవేందర్, ఎస్వోటూ జీఎం గుప్తా, ఏజీఎం తిరుమలరావు, ప్రాజెక్టు అధికారి ఉమాకాంత్, డీజీఎం (సివిల్) సతీష్ బాబు, ఏరియా సర్వే అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Next Story






