తగ్గేదేలే.. రాజకీయ వే'ఢీ'..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-06 15:40:27  IST  )

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కారణంగా వింత రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజకీయ వేడిని పుట్టిస్తోంది.

తగ్గేదేలే.. రాజకీయ వేఢీ..!
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కారణంగా వింత రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజకీయ వేడిని పుట్టిస్తోంది. అధికార పక్ష నేతలు.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి బదులు.. విపక్ష నేతలైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న.. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు ఒకరినొకరు మీడియా సమావేశాలు పెట్టీ మరి తిట్టుకోవడం ఆదిలాబాద్ లో రాజకీయ రచ్చకు తెరలేపింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రాజకీయంగా దూషించడమే కాకుండా.. వీరు వ్యక్తిగతంగా దూషించుకునే వరకు వెళ్ళడం.. ప్రస్తుతం ఆదిలాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది.

తగ్గేదే లే అంటున్న ఆ నేతలు..

ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మాజీ మంత్రి జోగురామన్న విమర్శిస్తే.. నీ అక్రమాల బండారం బయట పెడతానంటూ జోగు రామన్నకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకరికోకరు గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని.. పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డికి భజన చేయడం తప్పా అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదని.. సీఎం సభతోనే..వీళ్లిద్దరూ ఒకటేనని ప్రజలందరికీ అర్థమైందని జోగు రామన్న తీవ్ర స్థాయిలో ఆరోపించారు. దీనిపై తక్షణమే పాయల్ శంకర్ కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జోగు రామన్న ఆదిలాబాద్ లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని.. నీ బండారం అంతా బయట పెడతా అన్నారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు అయినా కలుస్తానని ఎమ్మెల్యే అన్నారు. దీంతో మళ్ళీ జోగురామన్న కౌంటర్ ఇస్తూ.. వ్యక్తి గత దూషణలకు పాల్పడితే సహించేది లేదని.. తానే పాయల్ శంకర్ కు రాజకీయ బిక్ష వేశానని చెప్పుకొచ్చారు. దీనికి పాయల్ శంకర్ స్పందిస్తూ.. ప్రజలకంతా తెలుసని.. జోగు రామన్న గురించి ఎక్కువ మాట్లాడి సమయం వృధా చేయనని స్పష్టం చేశారు. ఇంకా వీరిద్దరి మధ్య రాజకీయ వేడి ఎక్కడి వరకు చేరుతుందని పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు.

వ్యక్తిగతంగా దూషించుకున్న వైనం

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్న రాజకీయంగా మాటల యుద్ధానికి తెర లేపడమే కాకుండా.. వ్యక్తిగతంగా దూషించుకోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి నువ్వు బ్రోకర్ వా అంటూ జోగు రామన్న విమర్శలు చేయగా.. నీ అక్రమ సంబంధాలు రాసలీలలు సీడిలు ఉన్నాయని అవి పార్సెల్ చేస్తానంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు.. వీరికి సంబంధించిన పాత వీడియోలను ప్రస్తుతం మాటల యుద్ధానికి తెరలేపిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఆదిలాబాద్ లో ఈ రాజకీయ రచ్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Next Story