మ‌హిళా ప్రాణాన్ని కాపాడిన డ‌య‌ల్ 100

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ముధోల్ : ముదోల్ పోలీస్ నారిశ‌క్తి బృందం స‌మ‌య స్పూర్తితో స్పందించి ఆత్మహత్యకు యత్నించిన మహిళ ప్రాణాల్ని

మ‌హిళా ప్రాణాన్ని కాపాడిన డ‌య‌ల్ 100
X

దిశ‌, ముధోల్ : ముదోల్ పోలీస్ నారిశ‌క్తి బృందం స‌మ‌య స్పూర్తితో స్పందించి ఆత్మహత్యకు యత్నించిన మహిళ ప్రాణాల్ని రక్షించిన సంఘటన ముధోల్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్పీ జానకి షర్మిల ఈ ఘటనపై గురువారం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ కుటుంబ సమస్యలతో భాదపడుతూ జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సమాచారం డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న ముధోల్ పోలీస్ నారిశక్తి బృందం సమయస్ఫూర్తితో స్పందించి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను రక్షించారు. అనంతరం ముధోల్ పోలిస్ స్టేషన్ లో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా.. తక్షణ సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయవచ్చు అని సూచించారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు సిద్ధంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ముధోల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, ఎస్‌ఐ పెర్సిస్ పర్యవేక్షణలో విధుల్లో ఉన్న నారిశక్తి బృందం సమయానికి స్పందించి మహిళ ప్రాణాలను రక్షించినందుకు ఎస్పీ జానకి షర్మిల నారి శక్తిని అభినందించారు.

Next Story