బీమాతో జీవితానికి ధీమా : ఇండియన్ పోస్టల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వెంకటస్వామి

by Ratna Kumari |

దిశ‌, మామ‌డ : త‌పాలా శాఖ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా బాధిత కుటుంబాల‌కు అండగా నిలుస్తుందని ఇండియన్ పోస్టల్

బీమాతో జీవితానికి ధీమా : ఇండియన్ పోస్టల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వెంకటస్వామి
X

దిశ‌, మామ‌డ : త‌పాలా శాఖ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా బాధిత కుటుంబాల‌కు అండగా నిలుస్తుందని ఇండియన్ పోస్టల్ బ్యాంక్ పేమెంట్ బ్రాంచ్ మేనేజర్ వెంకటస్వామి అన్నారు. గురువారం మండలంలోని పునకల్ గ్రామంలో తపాలా బీమాపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఇతర సంఘటనల్లో మరణించినప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తపాలా బీమా చేసినట్లయితే జీవితానికి ధీమాగా ఉంటుందన్నారు. తపాల శాఖలో ఉన్న బీమాకు తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించి రూ.10ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా పొందవచ్చని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తపాలా కార్యాలయం బ్రాంచ్ మేనేజర్ లిఖిత, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story