కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు.

కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, కన్నెపల్లి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం కన్నెపల్లి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అన్నివేళలా శాంతి భద్రతలను కాపాడుకునేందుకే పోలీసు వ్యవస్థ పని చేస్తుందని అన్నారు. పోలీసులు ప్రజల కోసం నిరంతరం పని చేయాలని అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ 1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, మంచిర్యాల డిసిపి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, కన్నెపల్లి ఎస్ఐ భాస్కరరావు స్థానిక సర్పంచులు నెండుగురి వెంకన్న, గడ్డల జయలక్ష్మి, పోలీస్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.

Next Story