యువత మంచి మార్గంలో నడవాలి: డీజీపీ శివధర్ రెడ్డి

by Kodari Anjali |

యువత మంచి మార్గంలో నడవాలని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

యువత మంచి మార్గంలో నడవాలి:  డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, రెబ్బెన: రెబ్బెన పాత పోలీస్ స్టేషన్‌ను పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం గ్రంథాలయంగా రూపాంతరం – రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలోని పాత పోలీస్ స్టేషన్‌ను ఆధునిక సదుపాయాలతో గ్రంథాలయంగా అభివృద్ధి చేసి, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ గ్రంథాలయాన్ని ఆదివారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు మెరుగైన చదువు వాతావరణం కల్పించడం, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు అవసరమైన వనరులు అందించడం లక్ష్యంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

యువతకు ఉపయుక్తమైన అన్ని సదుపాయాలు కల్పించాం..

గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, సాధన మెటీరియల్, ప్రస్తుత వ్యవహారాల పుస్తకాలు, మరియు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే గ్రంథాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రశాంతమైన చదువు వాతావరణంతో పాటు, యువతకు ఉపయుక్తమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. యువతను ఉద్దేశించి చెడు మార్గాలలో ఆన్లైన్ గేమింగ్ మట్కా సట్కా గంజాయి పేకాట వంటి దురాలవాట్లకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నతమైన మార్గాన్ని అన్వేషించే స్థిరపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆసిఫాబాద్ ఎఎస్పీ చిత్తరంజన్, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ గడిగొప్పుల సతీష్ మరియు రెబ్బెన సీఐ సంజయ్, ఎస్ ఐ వెంకటకృష్ణ ఇతర పోలీస్ అధికారులు,ప్రజాప్రతినిధులు, యువత, విద్యావంతులు,సిబ్బంది పాల్గొన్నారు.

Next Story