- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు సాధించిన ఎస్పీ పోలీస్ అక్కలను అభినందించిన డీజీపీ
మహిళల భద్రతలో పోలీస్ అక్కలు కీలక పాత్ర పోషిస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు.

దిశ, ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల వినూత్నంగా అమలు చేసిన పోలీస్ అక్క కార్యక్రమం జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో... ఇలాంటి సేవలను రాష్ట్రస్థాయిలో విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లోని నూతన పోలీసు బ్రీఫింగ్ హాల్‌లో పోలీస్ అక్కలతో ప్రత్యేకంగా మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ప్రతిష్టాత్మాకంగా రూపొందించిన పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, పోలీస్ అక్కలను అభినందించారు. పోలీస్ అక్కలతో ఆత్మీయంగా మమేకమై, వారి సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు. సమాజంలో విద్యార్థినిలు, మహిళల భద్రతలో పోలీస్ అక్కలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినిల్లో సన్నిహిత్యం పెంచుతూ, మహిళలకు ధైర్యం కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు.
ఈ గుర్తింపును పురస్కరించుకుని....
భవిష్యత్తులో పోలీస్ అక్కలు మరింత సమర్థవంతంగా సేవలు అందించి జిల్లాకు, రాష్ట్రానికి ముఖ్యంగా మన పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అక్కలు తమ సేవా అనుభవాలు, ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలను డీజీపీతో పంచుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలిగామని పోలీస్ అక్కలు వివరించారు. ఈ విజయానికి కారణమైన అవకాశాన్ని కల్పించినందుకు జిల్లా ఎస్పీకి పోలీస్ అక్కలు కృతజ్ఞతలు తెలిపారు.. అనంతరం జాతీయ స్థాయిలో సాధించిన ఈ గుర్తింపును పురస్కరించుకుని పోలీస్ అక్కలకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా స్కోచ్ రిప్లికా అవార్డు సర్టిఫికెట్లు ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ జిల్లా పోలీసు అధికారులు, పోలీస్ అక్కలు పాల్గొన్నారు.






