పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

మంచిర్యాల(Mancherial) జిల్లాలోని లక్షెట్టిపేటలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని(Govt Hospital) ప్రారంభించారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల(Mancherial) జిల్లాలోని లక్షెట్టిపేటలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని(Govt Hospital) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తానూ గతంలో ఐ ప్రాంతంలో పాదయాత్ర చేసినపుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా లక్షెట్టిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు.

Next Story